కళాశాల పాట
రచయిత్రి: డా॥ సుబ్బరత్నమ్మ,
విశ్రాంత తెలుగు అధ్యాపకులు.
ఓంకార పంజర సుఖీం . . . 2
ఉపనిషత్ ఉధ్యాన కేళి . . .
కలకంఠీ ఆగమ విపీన మయూరీ . . .
ఆర్యాం . . . . అంతర్ విభావయేత్
గౌరీ . . . . . గౌరీ . . . . .
=> భువన మోహన మైన భరత వధూలలామకు
ఉధ్యాన వనమాంధ్ర సీమ . . . . 2
ఆ . . . . . ఆ . . . . . రామ వికసితోజ్వల
వర పారి జాత ప్రసూనమీ సింహపురము
ఆ . . . . . ఆ . . . . . మనోజ్ఞ లతాంత పరీమళ
కాంతి రేఖయే . . . ఈ దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల . . .
=> పినాకినీ నదీ పయః పవిత్ర భూతధాత్రిలో
అనంతమైన రంగనాధునాదర ప్రతిష్టతో . . . . 2
అనూన శోభ నుద్భ విల్లే ఆంధ్రభూమిని
జనాళి నోములే ఘనంబుగా ఫలించెనో అనంగ హో . . . . ॥2॥
కరమ్ము వెల్గుతన్ వినూత్న కాంతులన్
తమిశ్రముల్ హరించు జ్యోతి కాగా
వైజయంతి వైభవమ్ముతో విరించి రాణికే
విహార వీర మందిరంబుగాన్
ఇలన్ జయత్ ధ్వజ ప్రతీతి
ఈ కళాలయంబహో . . . . ॥3॥
విశ్రాంత సంగీత అధ్యాపకులు.